నిజామాబాద్- ఇందూరు : ఒలింపియాడ్ సైన్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి సాత్విక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు. నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సాత్విక్‌ను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పాఠశాల విద్యతో పాటు ఇతర సబ్జెక్టులపై కూడా విజ్ఞానం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ శిక్షణ పొందాలని సూచించారు. వేసవి సెలవులను వృథా చేయకుండా ప్రతి విద్యార్థి ఏదో ఒక రంగంలో ప్రత్యేక శిక్షణ పొందాలని పిలుపునిచ్చారు.
పేద విద్యార్థులకు తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. తమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థి సాత్విక్ ఉత్తమ ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందన్నారు.








