contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గ్రామాలకు రోడ్లు మంజూరు చేయండి : నిమ్మక జయరాజ్

జియ్యమ్మవలస: పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మ వలస గిరిజన గ్రామాలైన అర్నాడ, థాక్షిణి , రాజయ్యపేట ప్రాంతాలకు తక్షణమే రహదారులను మంజూరు చేయాలని కురుపాం మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ నాయకులు నిమ్మక జయరాజ్ కోరారు. శనివారం జియ్యమ్మవలస మండలంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిమ్మక జయరాజ్ మాట్లాడుతూ. సదరు గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మించాలంటూ గతంలోనే పలుమార్లు గ్రీవెన్స్‌లో వినతులు ఇచ్చామని గుర్తుచేశారు. ప్రజా దర్బార్ వేదికగా ఈ సమస్యను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి, స్థానిక కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు & ప్రభుత్వ విప్, తోయక జగదీశ్వరిల దృష్టికి మరోసారి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రహదారులు ఎంతో కీలకం. ఈ సమస్యపై స్పందించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రోడ్ల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :