తిరుపతి, జూన్ 05 : తిరుపతి కేటీ రోడ్‌లోని ప్రముఖ వెయిట్ లాస్, బ్యూటీ కేర్ సంస్థ ‘కలర్స్’కు సంబంధించిన అంశంపై రిపోర్టర్ టీవీలో ప్రసారమైన కథనానికి సంస్థ యాజమాన్యం వెంటనే స్పందించింది. వెయిట్ లాస్ మరియు బ్యూటీ కేర్ సంస్థ ‘కలర్స్’ తమపై వచ్చిన ఆరోపణల విషయంలో అత్యంత బాధ్యతాయుతంగా స్పందించి కస్టమర్ల సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఓ స్థానిక జర్నలిస్టు ఎదుర్కొన్న లావాదేవీల సమస్యపై మీడియాలో కథనాలు వెలువడిన నేపథ్యంలో, సంస్థ ప్రతినిధులు వెంటనే స్పందించి బాధితుడితో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించారు. గంటల వ్యవధిలోనే వివాదానికి ముగింపు పలికి, కస్టమర్‌కు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నట్లు సంస్థ యాజమాన్యం వెల్లడించింది.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, కస్టమర్ల సంతృప్తి తమకు అత్యంత ప్రాధాన్యమని, ఎలాంటి ఫిర్యాదులైనా వచ్చిన వెంటనే స్పందించి పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. మీడియాలో వచ్చిన కథనాలను సానుకూలంగా స్వీకరించి, బాధితులకు ఎలాంటి నష్టం జరగకుండా వారి అభ్యర్థనల మేరకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
వివాదాస్పద అంశాలను తక్షణమే పరిష్కరించడం ద్వారా ‘కలర్స్’ సంస్థ కస్టమర్ల నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అంతర్గత వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని సంస్థ యాజమాన్యం పేర్కొంది.
తమ సమస్యలపై వేగంగా స్పందించి, సత్వర పరిష్కారం చూపిన ‘కలర్స్’ యాజమాన్యానికి బాధితులు, స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వ్యాపార సంస్థలు వినియోగదారుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి చాటిచెప్పిందని, ఇతర సంస్థలు కూడా ఇదే తరహా సేవా దృక్పథాన్ని అవలంబించాలని ప్రజలు సూచిస్తున్నారు.








