గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో (ఎస్ఐఆర్) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, ప్రధాన వక్తగా పాల్గొని భూత్ లెవెల్ ఏజెంట్ల విధుల గురించి క్లుప్తంగా ప్రసింగించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ దాని ప్రాముఖ్యత, గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గునుకుల కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, బిజెపి రాష్ట్ర మాజీ కౌన్సిలింగ్ మెంబర్ విలాసాగరం రామచంద్రం, గన్నేరువరం 8వ వార్డు సభ్యులు మచ్చ సాయి కృష్ణ, మండల బిజెపి ఉపాధ్యక్షులు గాలిపెల్లి శంకర్, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి లు పుల్లెల రాము, గుమ్మడి సురేందర్ రెడ్డి, మండల కార్యదర్శులు సిహెచ్ చంద్రయ్య, బూట్ల సంపత్, మండల కార్యవర్గ సభ్యులు గూడూరి జగన్, కర్ర అనుషా రెడ్డి,నాయకులు మచ్చ బాలరాజు,పుల్లెల జగన్ మోహన్, గాద నరసింహస్వామి,కొంకట్ రవి, రంగనవేని కుమార్,చుక్కల లక్ష్మయ్య,గీకురు ఆంజనేయులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








