తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం దుర్గ సమీపంలోని అక్షయ క్షేత్రంలో వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బి. ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా అనాధ చిన్నారుల సమక్షంలో భారీ కేక్‌ను కట్ చేసి వారికి పంపిణీ చేశారు. అనంతరం బ్రెడ్లు, స్వీట్లు, పండ్లను అందజేసి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించారు.
కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బి. ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆదరణతో పాటు దేవుని అనుగ్రహంతో చెవిరెడ్డి కుటుంబం రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో చెవిరెడ్డి కుటుంబం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
చంద్రగిరి అభివృద్ధికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విశేష సేవలు అందించారని కొనియాడారు. ప్రజల ఆశీస్సులు, దేవుని కృపతో చంద్రగిరి కోటపై మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు ఆయురారోగ్యాలతో పాటు రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర యాదవ్, చంద్రగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సెంథిల్ కుమార్, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మునిశేఖర్, విద్యార్థి నాయకులు వెంకటేష్, భూపాల్, శ్రీనివాసులు, రామకృష్ణ, మహేందర్ రెడ్డి, వెంకట నాగరాజు, ప్రతాప్ కుమార్, సాయి, ఓబులేసు, దిలీప్ కుమార్, కృష్ణయ్య, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అభిమానులు కుప్పి రెడ్డి భాస్కర్ రెడ్డి, చెంగల్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, రఫీ, శేషా రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, పార్థసారథి, వెంకటరమణ నాయక్, మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజు రెడ్డి, మహేంద్ర, జగన్, చరణ్, ఓం ప్రకాష్, భూపాల్, గిరి, ముబారక్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.








