సిర్పూర్ నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన నిజమైన కార్యకర్తలకే కేటాయించాలని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) మైనారిటీ విభాగం ఛైర్మన్ అర్షద్ హుస్సేన్ ప్రభుత్వాన్ని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఆర్ ఫేజ్-2 సిర్పూర్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అర్షద్ హుస్సేన్ మాట్లాడుతూ.. సింగిల్ విండో ఛైర్మన్ పదవులకు కనీసం 5,000 పార్టీ సభ్యత్వాలు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి కనీసం 20,000 పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
కేవలం పదవుల ఆశతో పార్టీలోకి వచ్చిన స్వార్థపరులను పక్కనపెట్టి, పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తల శ్రమను గుర్తించి పదవుల కేటాయింపులో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.








