కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండలం: మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని మైనర్లకు, వాహనాలు ఇవ్వకూడదని, తల్లిదండ్రులు మైనర్లు కు వాహనాలు ఇవ్వడంతో దీంతో ప్రమాదాల్లో విలువైన ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తీవ్రమైన గాయాల పాలు అవుతున్నారని, తల్లిదండ్రులు మైనర్లకు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి వాహనాలను ఇవ్వద్దని ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. అదేవిధంగా మైనర్లు కు మరియు డ్రైవింగ్ లైసెన్సు లేదని తెలిసి కూడా వాహనం ఇచ్చినట్లయితే వాహనం ఇచ్చిన ఓనర్ పైన కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని, మరియు నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడపడం, తప్పుడు నంబర్లు ఏర్పాటు చేయడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే శ్రద్ధ కాలుష్యాన్ని సృష్టించే విధంగా ద్విచక్ర వాహనాలు సైలెన్సర్లను కలిగి ఉన్న వాహనదారులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. నిబంధనలకు లోబడి లేకపోతే, చీటింగ్ కేసు నమోదు చేస్తామని, కావున మండల ప్రజలు దీనిని దృష్టిలో పెట్టుకొని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, వాహనాలు ఇచ్చి రోడ్డు ప్రమాదాలకు కారకులు కారాదని, మరియు మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతోపాటు జరిమానాలు తప్పవని ఎస్సై జగదీశ్వర్ తెలిపారు.








