contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

స్కూల్ బస్ డీ .. యువకులకు తీవర గాయాలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని విఠల్ నగర్‌లో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమరేశ్వర స్కూల్ సమీపంలో బైక్‌పై ఇంటికి వెళ్తున్న ఇద్దరు యువకులను ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొనడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న వారు వెంటనే క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరు యువకులు గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన వారిగా ప్రాథమిక సమాచారం అందింది.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తుండగా, గాయపడిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :