contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రామడుగు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు పోలీస్ స్టేషన్‌ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన, స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్న కమిషనర్, స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి వారికి అప్పగించిన బాధ్యతలపై ఆరా తీశారు. స్టేషన్ రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించడంతో పాటు, నమోదైన కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ (CCTNS)లో సకాలంలో నమోదు చేయాలని ఆదేశించారు.

తెలంగాణ పోలీసు శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన సీసీటీఎన్ఎస్-2.0 (CCTNS 2.0), పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో ఈ-సమన్ల జారీ, టీఎస్-కాప్ (TS-COP), హెచ్‌ఆర్‌ఎంఎస్ (HRMS), ఈ-సాక్ష్య (e-Saakshya), టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్ (CEIR), సైబర్ క్రైమ్ ఆర్థిక, ఆర్థికేతర నేరాల సాఫ్ట్‌వేర్, సీడీఆర్ (CDR) వంటి సాంకేతిక వ్యవస్థలపై పూర్తి అవగాహన పెంపొందించుకుని, రోజువారీ విధుల్లో సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.

స్టేషన్‌కు కేటాయించిన పరికరాలను పరిశీలించిన సీపీ, బ్లూ కోల్ట్స్ సిబ్బంది పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ డివైస్‌ను ఉపయోగిస్తున్న తీరును తనిఖీ చేసి, సాంకేతిక పరికరాల వినియోగాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు.

ఎఫ్‌ఐఆర్ ఇండెక్స్‌ను పరిశీలించిన కమిషనర్, పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించారు. కేసుల పెండింగ్‌కు గల కారణాలను అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నమోదవుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, విసిబుల్ పోలీసింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలను సెక్టార్లు, సబ్‌సెక్టార్లుగా విభజించి, ప్రతి ప్రాంతానికి గ్రామ పోలీసు అధికారులను (VPOs) కేటాయించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ, వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రతి నెలా వారి తాజా వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.

ఈ ఆకస్మిక తనిఖీలో రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్‌ఐ రాజుతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :