contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ఇప్ప.నరేందర్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై జి. నరేందర్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జి ఎంపీడీవో సురేందర్, రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ కే. రామయ్య, పశు వైద్యశాలలో జూనియర్ వెటర్నరీ అధికారి స్వప్న, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మండల సమైక్య భవనంలో అధ్యక్షురాలు బొమ్మడి శిరీష జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అలాగే గన్నేరువరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రంగనవేణి లచ్చినర్సు, ఖాసీంపేట గ్రామ పంచాయితీ కార్యాలయంలో కర్నే చంద్రయ్య, మండల కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్, ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. లయన్స్ క్లబ్ భవనంలో బొడ్డు బాలయ్య, గౌడ సంఘం భవనంలో మండల అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్, పద్మశాలి సంఘం భవనంలో తెల్ల రవీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. లయన్స్ క్లబ్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా డిస్టిక్ క్యాబినెట్ చైర్మన్. లయన్స్ భవనం ట్రస్ట్ చైర్మన్ గంప వెంకన్న హాజరయ్యారు

అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం మండల ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనం ఈరోజు స్వేచ్ఛా భారతదేశంలో జీవిస్తున్నామని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈకార్యక్రమంలో ఖాసీంపేట గ్రామ ఉప సర్పంచ్ సందవేణి ఐలయ్య, జంగపల్లి గ్రామ ఉప సర్పంచ్ మాంకాళి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మాతంగి అనిల్,చాకలివాని పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు కూన చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దొగ్గల ప్రదీప్,కూన కోమరయ్య, బీజేపీ నాయకులు మచ్చ బాలరాజు,యాదవ సంఘం మండల అధ్యక్షుడు సందవేణి ప్రశాంత్ యాదవ్,పుల్లెల జగన్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :