గన్నేరువరం,కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల వ్యాప్తంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగపలం ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యం అని అన్నారు. ప్రతి ఒక్క పౌరుడు దేశం నాకేమి ఇచ్చిందని కాకుండా మనం దేశానికి ఏం ఇచ్చామనే ఆలోచన ధోరణితో మెలగాలని అన్నారు. దేశం పట్ల ప్రేమ, తోటి మానవుల పట్ల సమానత్వం భావనతో ఉండాలని అన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు మచ్చ బాలరాజు,బీజేపీ మండల నాయకులు సందవేణి ప్రశాంత్,కుర్ర హరీష్,పుల్లెల జగన్,వేముల రవి,గూడూరి జగన్, మునిగంటి సత్తయ్య, గూడూరి లచ్చయ్య,తెల్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.








