వెలిగండ్ల మండలం, నరసమాంబాపురం గ్రామానికి చెందిన ప్రముఖ వైఎస్సార్సీపీ నాయకులు ఉండేల అంకిరెడ్డిని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆదివారం పరామర్శించారు. గత కొంతకాలంగా షుగర్ (మధుమేహం) వ్యాధితో బాధపడుతున్న అంకిరెడ్డికి ఇటీవల కుడి కాలు తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన నరసమాంబాపురంలోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్.. పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులతో కలిసి అంకిరెడ్డి నివాసానికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న వైద్య చికిత్సల వివరాలను, ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను ఆరాతీశారు.ఈ సందర్భంగా డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. అంకిరెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని, పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. వైద్యుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ, ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.








