contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

యువజన సంఘాల ధర్నా భగ్నం చేసిన పోలీసులు .. గన్నేరువరం లో ఉద్రిక్తత ..

గన్నేరువరం,కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో ఆదివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యువజన సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. మండల కేంద్రంలో ఎలాంటి పరాజయాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు పేరుతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.. ఈ నేపథ్యంలో 11 గంటలకు వివేకనంద విగ్రహం వద్దకు చేరుకున్న యువజన సంఘం నాయకులు, వివిధ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దీక్షకు కూర్చొని ఎమ్మెల్యే కవ్వంపల్లికి వ్యతిరేకత నినాదాలు చేశారు. తిమ్మాపూర్, చొప్పదండి సిఐ లు బొల్లం రమేష్, ప్రదీప్, గన్నేరువరం, చొప్పదండి ఎస్సైలు జి. నరేందర్ రెడ్డి, నరేష్ రెడ్డిలు నిరసన తెలుపుతున్న యువకులను అరెస్టు చేసి పోలీస్ వాహనంలోకి ఎక్కించి చిగురుమామిడి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఎమ్మెల్యే కవ్వంపల్లిపై యువజన సంఘాలు తీవ్ర ఆగ్రహం!

గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం కోసం డిమాండ్ చేస్తున్న యువజన సంఘాల నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం కలకలం రేపింది. కాంగ్రెస్ నాయకులకు ఒకలా, యువజన సంఘాలకు మరోలా పోలీసులు వివరిస్తున్న తీరుపై నాయకులు తీవ్రస్థభంలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో యువతను నమ్ముకుని గెలిచి, నేడు వారిపైనే అణచివేత ధోరణి ప్రదర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

ద్విసభ్య విధానం: కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి ఆంక్షలు లేవు కానీ, ప్రజా సమస్యలపై నిలదీస్తున్న యువజన సంఘాలకు మాత్రం పర్మిషన్ నిరాకరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

10 రోజులు డెడ్ లైన్: పది రోజుల్లోగా రోడ్డు పనులు ప్రారంభించకపోతే ప్రజా ఉద్యారాన్ని ఉధృతం చేస్తామని యువజన నాయకుడు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి హెచ్చరించారు.

ఎమ్మెల్యేపై డైవర్షన్ రాజకీయం ఆరోపణ: గెలిచిన వంద రోజుల్లో రోడ్డు వేస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు ప్రజలకు చుక్కలు చూపిస్తున్న చేతకాని ఎమ్మెల్యేను తక్షణమే ప్రశ్నించాలని నాయకులు డిమాండ్ చేశారు.

భారీ మూల్యం చెల్లించుకుంటారు: యువకులపై తప్పుడు కేసులు పెడితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీ జెడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న హెచ్చరించారు.

కొనసాగుతున్న పోరాటం:
కాల్వ నాగరాజ్, గూడూరి సురేష్ తదితర యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గన్నేరువరం మండల ప్రజల హక్కుల కోసం ఈ పోరాటం ఏమాత్రం ఆగదని స్పష్టం చేశారు.

ఈ వివాదంపై స్థానిక ఎమ్మెల్యే లేదా అధికార పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి మరీ.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :