పాకాల : తిరుపతి జిల్లా పాకాల మండలం ఉట్లవారిపల్లిలోని ఆనందగిరి క్షేత్రంలో కొలువైన శ్రీ వల్లీ దేవసేన సమేత కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఈ నెల 16న బుధవారం వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో యువరాణి సురే తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ వేడుకలో పాల్గొనదలచిన భక్తులు ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, ఒక్క జంటకు రూ.1,500 రుసుముగా నిర్ణయించినట్లు తెలిపారు.
కళ్యాణోత్సవానికి సంబంధించి ముందస్తు బుకింగ్స్ కోసం దేవస్థానం చైర్మన్ స్లొంపల్లి చంద్రశేఖర్ నాయుడు (9440835886), ప్రధాన అర్చకులు హెచ్.ఎన్. కృష్ణమూర్తి శర్మ (9440243528), సెక్రటరీ ప్రకాష్ కోరా (9491580572)ను సంప్రదించాలని ఈవో సూచించారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 14వ తేదీ నుంచి కాణిపాకంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు అక్కడి దేవస్థానం బోర్డు సభ్యులు తనను ఆహ్వానించినట్లు ఈవో యువరాణి తెలిపారు.
ఆనందగిరి క్షేత్రంలో నిర్వహించనున్న కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని దేవస్థానం బోర్డు సభ్యులు కోరారు.








