కరీంనగర్ టౌన్: నగరంలో ట్రాఫిక్‌ను మరింత క్రమబద్ధీకరించడంతో పాటు ప్రయాణికులు, వాహనదారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తాలో ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శనివారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఈ నూతన ఔట్‌పోస్ట్‌లను ఆయన ప్రారంభించారు. ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ.. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ ఔట్‌పోస్ట్ బూత్‌లు ఉపయోగపడతాయని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ, వాహనాల కదలికలు, ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను ఎప్పటికప్పుడు గుర్తించి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ప్రయాణికులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సీపీ ఆదేశించారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య, సబ్-ఇన్‌స్పెక్టర్లు, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








