మెదక్, తూప్రాన్ : మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు జన్మదిన వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ఎస్పీకి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అధికారులు, సిబ్బంది సమక్షంలో ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది చూపిన ఆత్మీయతకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ఎస్పీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.








