మెట్పల్లి, జగిత్యాల జిల్లా: మెట్పల్లి పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు.
వివిధ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో ఊరేగింపుగా వట్టి వాగు నిమజ్జన ప్రదేశానికి తీసుకువచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని “గణపతి బప్పా మోరియా” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
అధికారులు, పోలీసుల సమన్వయంతో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా కొనసాగాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.








