contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

మహిళపై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడటంతో పాటు బలవంతంగా అబార్షన్ చేయించారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది.

ఈ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు శ్రీనివాసులు రెడ్డిని అరెస్టు చేయవద్దని, ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైదరాబాద్ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర రక్షణ ఉత్తర్వులు జారీ చేసింది.

జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. మహిళ చేసిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గతంలో శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేసింది.

అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ శ్రీనివాసులు రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ వరకు అరెస్టు సహా బలవంతపు చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :