మెదక్ జిల్లా – మాసాయిపేట – తూప్రాన్ : గణేష్ నిమజ్జనం సందర్భంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం శివారులో గురువారం తెల్లవారుజామున వినాయక నిమజ్జనం చేస్తుండగా కమిండ్ల గణేష్ (40) హల్దీవాగ్ డ్యాం కాలువలో గల్లంతయ్యారు.
వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కాలువలోకి దిగిన గణేష్ ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో చేగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గజ ఈతగాళ్ల సహాయంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. గణేష్ ఆచూకీ కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








