contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఘనంగా 44వ గణపతి నవరాత్రుల ముగింపు కార్యక్రమాలు

కాకినాడ: 44వ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా కాకినాడలోని స్వయంభు భోగి గణపతి పీఠంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రి దీక్షలు చేపట్టిన మహిళలు మట్టి వినాయక విగ్రహానికి షోడశోపచార పూజలు నిర్వహించి, అనంతరం భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.

నిమజ్జనం అనంతరం 5 కోట్ల వత్తులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సిటీ వినాయక సాగర్ వద్ద పూజలు చేసిన అనంతరం సూర్యారావుపేట సముద్రతీరానికి శోభాయాత్రగా తరలివెళ్లారు. నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో సముద్రుడికి కుంభహారతి సమర్పించారు.

నిమజ్జనం చేసిన పవిత్ర జలాలను భక్తులకు పంపిణీ చేశారు. సముద్రతీరానికి చేరుకున్న భక్తులకు నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు రంబాల వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. అనంతరం దీక్షలు చేపట్టిన మహిళలు సముద్ర స్నానం చేసి నవరాత్రి దీక్షలను విరమించారు.

ఈ సందర్భంగా గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు, వరలక్ష్మి దంపతులు మాట్లాడుతూ లోక కల్యాణాన్ని ఆకాంక్షిస్తూ కాకినాడ నగరంలో తొమ్మిది రోజుల పాటు గంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ 5 కోట్ల వత్తులతో నీరాజనం నిర్వహించినట్లు పేర్కొన్నారు.

భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :