పల్నాడు జిల్లా – మాచర్ల : మాచర్ల పట్టణంలోని వైసిపి పార్టీ కార్యాలయంలో 7, 8వ వార్డులకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా వైసిపి అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కార్యక్రమంలో పాల్గొని గుర్తింపు కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా 7, 8వ వార్డులకు చెందిన పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనడంతో పార్టీ కార్యాలయం సందడిగా మారింది.
పార్టీ కార్యకలాపాలను మరింత సమన్వయంతో నిర్వహించేందుకు కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ చేపట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు. వార్డు స్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర కీలకమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.








