contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

స్వచ్ఛతలో గిద్దలూరు మున్సిపాలిటీకి ప్రతిష్ఠాత్మక పురస్కారం

  • “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ మున్సిపాలిటీలు” అవార్డుకు ఎంపిక

 

గిద్దలూరు: పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన గిద్దలూరు పురపాలక సంఘానికి ప్రతిష్ఠాత్మక “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ మున్సిపాలిటీలు” పురస్కారం లభించింది.

పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపరచడం, వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం, పారిశుధ్య విధానాలను పటిష్ఠంగా అమలు చేయడంలో మున్సిపాలిటీ సాధించిన ఫలితాలను గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

ఈ అవార్డును గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ ఈ.వి. రమణ బాబు శుక్రవారం విజయవాడలోని A1 కన్వెన్షన్లో జరిగే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకోనున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ ఈ.వి. రమణ బాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు ఒక్క మున్సిపాలిటీకి మాత్రమే కాకుండా గిద్దలూరు పట్టణ ప్రజలందరికీ దక్కిన గౌరవమని పేర్కొన్నారు.

పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్న పారిశుధ్య కార్మికులు, స్వర్ణ వార్డు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అలాగే పారిశుధ్య కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తున్న పట్టణ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల సహకారంతో రాబోయే రోజుల్లో గిద్దలూరును మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు.

ఈ పురస్కారం సాధించడంలో సహకరించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, ముత్తుముల కృష్ణ కిశోర్ రెడ్డిలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు గిద్దలూరు పురపాలక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :