పల్నాడు జిల్లా – దుర్గి : దుర్గి మండలం శ్యామరాజుపురం గ్రామానికి చెందిన కీ.శే. మెట్టెల ఆంజనేయులు పెద్దకర్మ కార్యక్రమం గురువారం వారి స్వగృహంలో జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు, స్థానికులు కార్యక్రమానికి హాజరై ఆయనకు నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు హాజరయ్యారు. ఆంజనేయులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఆంజనేయులు కుటుంబ సభ్యులను యాగంటి మల్లికార్జునరావు పరామర్శించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో గ్రామానికి చెందిన పెద్దలు, బంధువులు, స్థానికులు పాల్గొని కీ.శే. మెట్టెల ఆంజనేయులు మృతికి సంతాపం తెలిపారు.








