వెల్దుర్తి, తూప్రాన్ : మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడనే అనుమానంతో బ్యాగరి రామానుజంపై దాడి చేయడంతో మృతి చెందిన ఘటన యెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఫోన్ లొకేషన్ ఆధారంగా రామానుజంపై అనుమానం వ్యక్తం చేసిన ఎనిమిది మంది అతనిపై చేతులతో, కాళ్లతో, కర్రతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రామానుజం మృతి చెందాడు.
కేసు దర్యాప్తులో భాగంగా ఎనిమిది మందిని తూప్రాన్ సీఐ ఏ. వెంకట రాజ గౌడ్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. ఈ కేసులో ఒక CCL కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.








