హైదరాబాద్ – చాంద్రాయణగుట్ట : చాంద్రాయణగుట్టలోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ (GC) పరిధిలోని 2 సిగ్నల్ బెటాలియన్ (2 SIG) లో కుల వివక్షకు సంబంధించిన తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
కులం ఆధారంగా కొందరు సిబ్బందిపై వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులు ఉంటే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, ఆరోపణలపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, సంబంధిత అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.








