contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాకా ఆశయాలే మా బాట .. ప్రజా సంక్షేమమే మా లక్ష్యం

గోదావరిఖని : దివంగత ప్రజానాయకుడు, తెలంగాణ ఉద్యమ యోధుడు కాకా వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా రామగుండంలో ఘనంగా నివాళులర్పించారు. నగర మేయర్ మహంకాళి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.డి. ముస్తఫా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొంతల రాజేష్, గుమ్మడి కుమారస్వామి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి తన జీవితాంతం పేదలు, కార్మికులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేసిన ప్రజానాయకుడని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు.

యువతకు ఉపాధి, పేదలకు న్యాయం, సామాజిక న్యాయం కోసం కాకా వెంకటస్వామి చూపిన మార్గంలో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్మికులు, నిరుపేదలు, యువత సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

కాకా వెంకటస్వామి ఆశయాలను భవిష్యత్ తరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాకా వెంకటస్వామి అభిమానులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :