contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కల్తీ పెట్రోల్ పై స్పందించిన అధికారులు

మాసాయిపేట, తూప్రాన్ : మాసాయిపేట మండల కేంద్రంలోని ఎన్‌హెచ్‌-44 హైవే పక్కన ఉన్న భారత్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌లో నీరు కలిపి కల్తీ చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు.

వాహనదారుడు గుడి కృష్ణ మాదిగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం పౌరసరఫరాల శాఖ ఇన్‌స్పెక్టర్లు నర్సింలు, నిస్సార్ బంక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ నాణ్యత, కొలతలు, సంబంధిత రికార్డులను పరిశీలించడంతో పాటు పెట్రోల్ నమూనాలను సేకరించారు.

ఫిర్యాదుదారు గుడి కృష్ణ మాదిగతో పాటు జర్నలిస్టులు విజయ్, ఎల్లం, ఏర్పుల భూపాల్, బాలసాయి హరిప్రసాద్ సమక్షంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సేకరించిన శాంపిల్స్‌ను నిబంధనల ప్రకారం పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే పెట్రోల్ బంక్ యజమానికి నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. వినియోగదారులతో మర్యాదగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని యజమానికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. తనిఖీల అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :