కరీంనగర్ – గన్నేరువరం :సోషల్ మీడియాలో పోస్టుల పై అడ్మిన్ లు జాగ్రత్తగా ఉండాలని, ఫిర్యాదులు వస్తే కటిన చర్యలు తప్పవని కరీంనగర్ రూరల్ ఏసిపి కరుణాకర్ రావు హెచ్చరించారు. ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఏసిపి మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో కించ పరిచేలా, రెచ్చ గొట్టే పోస్టులు, అనుచిత పోస్టులు, కుల మత వర్గ విభేదాలు సృష్టించేలా పెట్టడం ద్వారా గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఫిర్యాదులు వస్తె అడ్మిన్ తో పాటు పోస్ట్ పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తపుడు పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలతో ఎదుటి వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. ఎవరైనా తప్పుడు పోస్టులు పెడితే వాటిని అడ్మిన్ లు తొలగించాలని తెలిపారు. గ్రూప్ లలో ఎవరు తప్పుడు పోస్టులు పెట్టవద్దని సూచన చేశారు. సమావేశంలో తిమ్మాపూర్ రూరల్ సిఐ శశిధర్ రెడ్డి, ఎల్ఎండి, గన్నేరువరం ఎస్సైలు ప్రమోద్ రెడ్డి, మామిడాల సురేందర్ పాల్గొన్నారు.
