contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చారిత్రాత్మకం:జే సిఎస్ మండల కన్వీనర్ కె.వి రమణ

అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి,ది రిపోర్టర్ న్యూస్ : నవరత్నాలలో చెప్పినట్లు పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో 51392 మంది పేదవాళ్లకు , సీఆర్డీఏ పరిధిలో 1402.58 ఎకరాల్లో 25 లేఔట్లు వేసి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం దేశంలోనే చారిత్రాత్మకమని జేసిఎస్ మండల ఇన్చార్జి కేవీ రమణ అన్నారు. పేదలకు ఇంతవరకు పట్టాలు ఇవ్వకుండా టిడిపి ప్రభుత్వం హైకోర్టులో కేసులు వేసి అడ్డుకుందని టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పేదలకు చేసింది ఏమీ లేదని,పేదల ఎదుగుదలను అడ్డుకోవడమే బాబు నైజం అని కె.వి.రమణ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. 14 సం,, ముఖ్యమంత్రిగా చేసి, 40 సంవత్సరములు ఇండస్ట్రీ ఆని చెప్పుకునే బాబు రాష్ట్రానికి చేసింది శూన్యం అని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి, అధికారంలోకి వచ్చిన బాబు,ఇప్పుడు మహానాడులో కొత్త అవతారం ఎత్తి పాతపాటే పాడడం, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో లోని కొన్ని పథకాలను,కర్ణాటకలో కాంగ్రెస్ మానిఫెస్టో నుంచి కొన్ని పథకాలను,కర్ణాటకలో బిజెపి మేనిఫెస్టో నుంచి కొన్ని పథకాలను కాపీ కొట్టి గతంలో లాగే అలమికాని హామీలను ఇస్తూ ప్రజలను మరొకసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని గతంలో బాబు 500 పైన హామీలను ఇచ్చి మేనిఫెస్టోనీ వెబ్సైట్ నుండి కనపడకుండా చేశారని,గతంలో ఇంటికో ఉద్యోగం, రైతు రుణమాఫీ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, బంగారం ఆభరణాలు రుణమాఫీ, అని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి వాటిని పూర్తిగా తుంగలో తొక్కిన విషయం ప్రజలకు తెలుసని, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తూ ఉంటే మరో శ్రీలంక అవుతుందన్నారు,మరి బాబు పథకాలు ఇస్తే , అమెరికా, సింగపూర్, జపాన్ అవుతుందా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. అమరావతిలో పేదవారికి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయ వేసినాచంద్రబాబు నాయుడు కి, యెల్లో మీడియాకు బుద్ది రాలేదని , పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను సమాధులతో పోల్చే పార్టీలు, నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఉండటం దురదృష్టకరం ఆని అన్నారు. రానున్న రోజుల్లో ఇటువంటి పార్టీలకు,నాయకులకు సరైన బుద్ది చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కే.వి.రమణ అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :