తూప్రాన్ : గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా “చైల్డ్ సేఫ్టీ వీక్” కార్యక్రమం తూప్రాన్ మున్సిపల్ పరిధిలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిలలో బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేశారు.
ఈ కమిటీల సభ్యులకు బాలల రక్షణ, హక్కులు, మరియు బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు. పిల్లల సంక్షేమం కోసం సమన్వయంతో పనిచేయాలని అధికారులుచెప్పారు.
ఈ సందర్భంగా పసిపిల్లల రక్షణ కోసం క్రేడిల్ (పాల్నా) ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా కారణాల వల్ల పిల్లలను పెంచలేని పరిస్థితుల్లో ఉన్నవారు, వారిని సురక్షితంగా క్రేడిల్లో ఉంచాలని సూచించారు. పిల్లలను నిర్లక్ష్యంగా వదిలేయడం శిక్షార్హమైన నేరమని అధికారులు హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడీఎస్ అధికారులు, సూపర్వైజర్లు, ఎంపిడీఓ, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించబడింది.








