స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 11:30 నిమిషాలకు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు కట్ట వద్ద అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ నర్సింహ గౌడ్, మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్లు, తహశీల్దార్ విజయ్ కుమార్ , CI శ్రీనివాసులు రెడ్డీ , మున్సిపల్ కమిషనర్ సుజాత,De వెంకటరమణ, AE ప్రవీణ్, Ro వెంకటరామయ్య, HMWS AE అమీరుద్దిన్ , AE శంకర్ , అన్ని శాఖల అధికారులు, ప్రజలు, విద్యార్థులు అన్ని పార్టీల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.