contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

THE REPORTER TV

వైసీపీ అరకు ఎమ్మెల్యే సీటు నైని సత్తిబాబు కే దక్కేనా!!

  • పాల్గుణ ఆర్థిక బలం, పై సత్తిబాబు,ఆర్థిక, జన బలంతో ఢీ కోట్టగలిగేనా?

అల్లూరి జిల్లా అరకువేలి : వైసీపీ యువ నాయకుడు నైని సత్తిబాబు కు ఎమ్మెల్యే టిక్కెట్ అంటూ, పేపర్ న్యూస్హ లో అల్ చల్ అవుతుందటాన్ని చూసి కొందరు ఆమ్మో అనీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, మరి కొంత మంది టిక్కెట్ ఇస్తే గెలుపు..అవకాశం ఉందంటున్నారట!

ప్రస్తుత అరకు ఎమ్మెల్యే పాల్గుణకు ఆర్థిక బలం ఉన్న,ప్రజా బలం తగ్గటంతో, సీటు నిరాకరిస్తే, సరైన అభ్యర్థి కోసం వైసీపీ అది నాయకత్వం అన్వేసిస్తున్న నేపథ్యంలో ఆర్థిక బలం అంతగా లేని,నైని సత్తిబాబు ఆశా దీపం లా కనిపించారట!

ఇదే సమయంలో క్యాడర్ లో డామేజ్ ఉన్న అరకు ఎమ్మెల్యే పాల్గుణ,టీడీపీ అభ్యర్థి దొన్నుదొర గతంలో, ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో వచ్చిన దొన్ను దొరను డీ కొట్టే అవకాశమే లేదట, ఎందుకంటే  ఇప్పటికే పాల్గుణ , వర్గీయులు ఎవరికి వారే టిక్కెట్ రేసులో ఉంటూ టిక్కెట్ ల కోసం లాబీయింగ్ లో ఉన్నారు, అందుకే, ఇటూ పోయి, అటూ పోయి, నైని సత్తిబాబు కు
ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది, సత్తిబాబు కు అంతగా అర్ధ బలం లేదని అందరూ అనుకుంటున్నారు ఐతే, సత్తిబాబు సతీమణి కుటుంబం బాగా ఆర్దికంగా ఉన్నతంగా ఎదిగిన వారని తెలుస్తోంది,వాళ్ళ సహాయం తోనే ఎన్నికల్లో నిలబడే సాహసం చేస్తున్నారు.మరో వైపు సతీమణి రజనీ నియోజకవర్గం లో రెండో స్థానం లో జనాభా కలిగిన సామజిక వ ర్గానికి చెందిన వారు కావడం కలిసొచ్చే మరో అంశంగా పరిశీలకు బావిస్తున్నారు. ఇదే విషయాన్నీ ఇంటిలిజెన్స్ వర్గాల నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సత్తిబాబు కు అదిష్టానం నుండి టిక్కెట్ ఆఫర్ పిలుపు వచ్చిందని విశ్వాసనీయ వర్గాల సమాచారం. సత్తిబాబు కూడా ముందు చూపుతో అంగ,అర్థ ,అస్త్ర, శాస్త్రాలు సిద్దం చేసుకునీ రంగంలో దూకడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. గ్రామాల్లో పర్యటనలకు రంగం సిద్దం చేశారట, ఏది ఏమైన కొద్ది రోజుల్లో నెలకొన్న సందేహాలు తీరనున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :