అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలసిన శ్రీ బొలికొండ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్బంగా గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం , తనయుడు గుమ్మనూరు ఈశ్వర్, ఎమ్మెల్యే సోదరులు గుమ్మనూరు శ్రీనివాసుల,గుమ్మనూరు నారాయణ గార్లు కలసి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు శ్రీవారికి నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే రథోత్సవాన్ని లాంఛనంగాప్రారంభించారు.ఈ కార్యక్రమం లో గుంతకల్లు నియోజకవర్గం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
