అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ కార్యాలయం వద్ద ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్మికుల అందరితో సంతకాల సేకరణ చేయడం జరిగినది, ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు , సిఐటియు పట్టణ కార్యదర్శి నిర్మలమ్మ , జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్న, మారని భవిష్యత్తు ,తలరాత ఎవరైనా ఉన్నారు అంటే అది మున్సిపల్ పారిశుధ్యం, మరియు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులె , రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసే ప్రయత్నాన్ని కార్మికుల ఐక్యత పోరాటంతో తిప్పి కొట్టి అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలనే పోరాటంలో ప్రతి ఒక్క కార్మికుడు,కార్మికురాలు భాగస్వామి కావాలని ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు కోవిడు, మలేరియా, గార్బేజ్, బదిలీ, కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని రెగ్యులర్ కార్మికులకు బకాయి ఉన్న సరెండర్ లీవ్ తోపాటు బకాయి ఉన్న డి ఏ లు ఇంక్రిమెంట్లు అమలు చేయాలని, పట్టణాలకు అనుకూలంగా కార్మికుల సంఖ్య పెంచాలని మున్సిపల్ కార్మికులతో స్థానిక సమస్యల పైన కమీషనర్ జబ్బర్ మియా కు సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో నగర అధ్యక్ష కార్యదర్శులు సూర్యనారాయణ, రామాంజనేయులు,, ఇంజనీరింగ్ సెక్షన్ నగర అధ్యక్షులు రాజా, కమిటీ సభ్యులు శ్రీనివాసులు, రత్నాలు, చంద్ర, వెంకటమ్మ, లక్ష్మీదేవి, పుల్లన్న, ఈశ్వరయ్య, హరి, ,తదితరులు కార్మికులు పాల్గొనడం జరిగినది.
