అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాతృమూర్తి అయిన శారదమ్మ సోదరుడు నారాయణస్వామి భార్య త్రివేణి పేరు మీదుగా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి గురువారం నెలవారి పరీక్షలకు వచ్చు గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు గుత్తి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ ప్రకటించారు. ఈ కార్యక్రమం ఉదయం నుండి సాయంత్రం వరకు వైద్యశాలకు వచ్చే గర్భిణీలకు సరైన ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గర్భిణీలకు అన్నదానం చేసే అవకాశం తమకు రావటం చాలా సంతోషంగా ఉందని గుమ్మనూరు నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించడంపై మండలంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.