ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము లో పల్లె పల్లెకు ప్రగతి శోభ అంటూ 13326 గ్రామాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామసభలు నిర్వహించారు. ఇందులో భాగంగాఅనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బసినేపల్లి గ్రామ సభలో తెలుగుదేశం పార్టీ అనంతపురము పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ తెలుగుదేశం పార్టీ మండల ఇన్చార్జ్ గుమ్మానూరు నారాయణ లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత జగన్ పాలనలో 5 ఏళ్లుగా చీకటిలో మగ్గి పోయిన గ్రామ స్వరాజ్య పంచాయతి వ్యవస్థకు ఊపిరిపోస్తూ గ్రామ సభలను ప్రారంభించడం జరిగిందన్నారు. చెత్తనుండి సంపద తయారుచేసే కేంద్రాలను నిర్మిస్తే జగన్ రెడ్డి వాటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నాడని, గ్రామ పంచాయతీలలో రోడ్లు ఊడ్చేందుకు చీపుర్లు కూడా లేక, డ్రైనేజీలు శుభ్ర పరిచేందుకు స్థోమతులేక సర్పంచులు అప్పులు చేసి గ్రామపంచాయతీలను నిర్వహించే పరిస్థితికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో అనేకమంది సర్పంచులు అప్పులబాధ తాళలేక బ్రతుకు దెరువు కోసం ఊళ్ళువదిలి వెళ్లిపోవడం జరిగిందన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ సారథ్యంలో జాతీయ ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలు చేసి గ్రామాలలో వలసలను ఆపడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. పంచాయతీలలో ప్రజలను భాగస్వాములను చేసి అభివృద్ధి బాట పట్టించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ గ్రామసభలను ప్రారంభించడం జరిగిందన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క గ్రామ ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో బద్రివల్లి, మహమ్మద్ వలి, రంగారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, షరీఫ్, రవితేజ, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.