అనంతపురం జిల్లా, గుత్తి: గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సూచనల మేరకు, గుత్తి మండల టీడీపీ ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆధ్వర్యంలో మంగళవారం గుత్తి పట్టణంలోని 22వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ముఖ్యంగా ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.13 వేల చొప్పున ఆర్థిక సహాయం, రైతులకు అందిస్తున్న రైతు భరోసా, మహిళల కోసం ఉచిత గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల గురించి ప్రజలకు వివరించారు.
కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ టీడీపీ అధ్యక్షులు ఎంకే చౌదరి, గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చికెన్ శీనా యాదవ్, గుత్తి మాజీ కౌన్సిలర్ సప్లయర్ సుంకన్న యాదవ్‌తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








