గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: జడ్పీహెచ్ఎస్ గన్నేరువరం పాఠశాలలో శుక్రవారం జరిగిన ఎస్ జి ఎఫ్ మండల స్థాయి బాలబాలికల క్రీడా పోటీలను గురువారం ప్రారంభమై, శుక్రవారం ముగిసినాయి, ఈ పోటీలలో భాగంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఇందులో అత్యున్నతమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడాలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నేరువరం మండల విద్యాధికారి కే. రామయ్య హాజరై పోటీల్లో ఎంపికైన బాల బాలికలను అభినందిస్తూ, జిల్లా స్థాయిలో కూడా ఉత్తమ ప్రదర్శన చేసి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని క్రీడాకారులను కోరారు. ఈ కార్యక్రమంలో వి. ప్రవీణ,బి. రమ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.








