అమలాపురం: ఎస్టీ మహిళా ఉద్యోగిని చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డ భవాని మృతికి కారకులైన దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఏడవ రోజుకు చేరుకున్నాయి. గురువారం జోరున కురుస్తున్న వర్షంలోనూ భవాని కుటుంబ సభ్యులు దీక్ష కొనసాగించారు అన్యాయంగా భవానీని వేధింపులకు గురిచేసి చంపేశారని ఆరోపించారు ఇప్పటివరకు దోషులను అరెస్టు చేయకపోవడం దారుణమని అన్నారు పేదలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు భవాని మృతికి కారకులైన ప్రధాన నిందితుడు దంగేటి రాంబాబు అతని అనుచరులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భవాని కుటుంబ సభ్యులతో పాటు వీసీకే పార్టీ జిల్లా అధ్యక్షులు బొంతు రమణ దళిత సేన అధ్యక్షులు డేవిడ్ అంబేద్కర్ విద్యార్థి సంఘం నాయకులు రేవు తిరుపతిరావు దళిత నాయకులు శెట్టి బత్తుల తులసిరావు మాగాపు వివేకానంద తదితరులు పాల్గొన్నారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/01/తెలంగాణ-హైకోర్టు-సీజేగా-జస్టిస్-సుజయ్-పాల్.webp)