ప్రకాశం జిల్లా / చీమకుర్తి : చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా , సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు రూపాయలకే భోజనం ఎంతోమంది నిరుపేదలకు ఉపయోగకరంగా ఉంటుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్, ఏ ఈ , మండల తహసిల్దార్ మరియు పట్టణ తెదేపా నాయకులు గొల్లపూడి సుబ్బారావు, , కందిమల్ల గంగారావు, ఎడ్లపల్లి రామ్బ్రహ్మం, సురేష్, కాట్రగడ్డ రమణయ్య, సూరంపల్లి హనుమంతరావు, మనం ప్రసాదు, రావి పాటి రాంబాబు. తదితరులు పాల్గొన్నారు