అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం ఏపీ మహిళా సమాఖ్య (సీపీఐ) కార్యదర్శిగా గుత్తికి చెందిన మహముదాను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పార్వతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శిగా ఎంపికైన మహముదా మాట్లాడుతూ నియోజకవర్గంలో సీపీఐ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, తనపై నమ్మకంతో నియోజకవర్గ స్థాయి పదవిని ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.