అమరావతి : రేషన్ బియ్యం దారి మళ్ళిం పునకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మాఫి యా ఆగడాలకు కళ్లెం వేసేందుకు పక్క స్కెచ్ వేసింది.
ఇందులో భాగంగా డిజిటల్ సాంకేతికతను తెరపైకి తేనుం ది. ప్రతి బస్తాకు క్యూఆర్ కోడ్ సీల్ వేయడం ద్వారా అక్రమా లకు చెక్ పెట్టాలని భావిస్తోంది. చెలరేగిపోతున్న రేషన్ మాఫియాను అడ్డుకోవడంలో భాగంగా క్యూ ఆర్ కోడ్ విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతి బస్తాను ట్రాకింగ్ చేసేందుకు వీలుగా అన్ని బియ్యం బస్తాలపై సెక్యూరిటీ సీల్ ముద్రించనున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ఏ బస్తాను ఎక్కడికి పంపిస్తున్నారనేది స్పష్టంగా తెలియనుంది. పైలెట్ ప్రాజెక్ట్ గా త్వరలోఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేసేందుకు సివిల్ సప్లైస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సత్ఫలితాలు వచ్చినట్లైతే రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తుట్లు తెలుస్తోంది. పేదల కడుపు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో 1 కోటి 46 లక్షల కుటుంబాలకు రేషన్ అందిస్తోంది. పలువురు రేషన్ కార్డుదారులు ఆ బియ్యాన్ని తిరిగి ఎండీయూ ఆపరేటర్లకు కేజీ రూ.7 నుంచి రూ.9 చొప్పున విక్రయిస్తున్నారనేది బహిరంగ రహస్యం. కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తున్న బియ్యాన్ని ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు కల్సి రాష్ట్రాలు దాటించి అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు.
ఈక్రమంలో ప్రతి బియ్యం బస్తాపైన క్యూ ఆర్ కోడ్ సెక్యూరిటీ సీల్‌ను వేసి క్షేత్రస్థాయిలో పేదలకు పంపిణీ చేసే వరకు ట్రాకింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.