కన్నెపల్లి గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చిన దుర్గం అశోక్
విష జ్వరాలతో… బాధపడుతున్న కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణి
మంచిర్యాల జిల్లా.చెన్నూరు మండలం కన్నెపల్లి గ్రామంలో విషజ్వరాలతో బాధపడుతున్న భాదితులను దుర్గం అశోక్ పరామర్శించి, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎల్లవేళలా నిస్వార్ధంగా సేవ చేయడానికే ఉన్నానని, ఈ జ్వరాల కారణంగా ఎలాంటి ఆందోళన చెందవద్దు అని, ఎలాంటి సహాయం చేయడానికి అయినా నేను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ జ్వరాలకు కారణాన్ని విచారణ చేసి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, దీనిని పునరావృతం కాకుండా చూస్తానని అశోక్ ప్రజలకు తెలిపారు. అనంతరం ఎనభై ఒక్క మంది బాధిత. కుటుంబాలకు ఇరవై ఐదు రోజులకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు అశోక్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, రెండేళ్ల క్రితం ఇదే మాదిరిగా వారు. అనారోగ్యాలకు గురి అయినప్పుడు, భాదితులకు భోజనాలు ఏర్పాటు చేసి, వారికి తగు సహాయాన్ని అందించినట్లు ప్రజలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల అంకాగౌడ్, జనగామ శ్రీనివాస్, మాడెం శ్రీనివాస్, పలువురు పాల్గొన్నారు..