contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాకిస్తాన్ పై భారత్ గెలవగానే చిన్నపిల్లాడిలా గంతులేసిన గవాస్కర్

భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లు ఎలాంటి వినోదాన్ని అందిస్తాయో చెప్పేందుకు, మెల్బోర్న్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్-12 మ్యాచే నిదర్శనం. ఆఖరి బంతి వరకు విజయం దోబూచులాడిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో భారత్ విజేతగా నిలిచింది.

కాగా, భారత క్రికెట్ మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, క్రిష్ణమాచారి శ్రీకాంత్, ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ పోరును ప్రత్యక్షంగా వీక్షించారు. చివర్లో అశ్విన్ విన్నింగ్ షాట్ కొట్టగానే గవాస్కర్ ఆనందం అంతాఇంతా కాదు. ఆయన చిన్నపిల్లాడిలా గంతులేశారు. టీమిండియా విజయాన్ని ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. శ్రీకాంత్, ఇర్ఫాన్ పఠాన్ లతో తన సంతోషాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

అటు, టీమిండియా విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. భారత్ లో అయితే దీపావళి ఒకరోజు ముందే వచ్చినట్టయింది. మ్యాచ్ ముగియగానే అభిమానులు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చుతూ తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.

https://twitter.com/Rporterinida/status/1584246102689468416

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :