contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

GHMC ముసుగులో పైసా వసూల్ … ఎవరి వాటా ఎంత ?

  • GHMC వాళ్లమంటూ డబ్బులు డిమాండ్
  • ప్రభుత్వం జీతవాలు ఇవ్వదు ..
  • GHMC కార్మికులకు మేమే జీతాలు ఇచ్చేది
  • డబ్బులు ఇవ్వకుంటే చెత్త తీయం – ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండి
  • మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సిబ్బంది అడ్డగోలుగా.. ఆగడాలు ..
  • GHMC ఏమి చేస్తోంది ?
  • GHMC పారిశుధ్య కార్మికులు ఎక్కడ ? వాహనాలు ఎక్కడ ?

హైదరాబాద్ : పట్టణాల్లో కంపునంతా ఎత్తిపారేస్తున్నా పారిశుధ్య కార్మికుల సేవలకు సలాం. కార్మికులు పట్టణ వీధుల్లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ట్రాక్టర్లలోకి ఎత్తి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. పలు మున్సిపాలిటీల్లో కొన్నేళ్లుగా సేవలందిస్తున్నారు. ఈ మధ్యకాలం అమీర్ పేట మధురానగర్ లో కొందరు GHMC వారమని , ప్రతి నెల చెత్త తీస్తున్నందుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మీ చెత్త మీ ఇంట్లో పడేసి వెళ్తామని బెదిరిస్తున్నారు. వాస్తవానికి GHMC కార్మికులే అయితే వారి కష్టాన్ని గుర్తించి డబ్బులు ఇచ్చినా పరవాలేదు. కానీ ఈ మిడిల్ మీడియేటర్లు ఎవరు ? మేమే డబ్బులు కలెక్ట్ చేసి GHMC వారికి అలాగే కార్మికులకు వేతనాలు కూడా ఇచ్చేది మేమే అంటున్నారు. .. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు అంటూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఈ టీమ్ ఎవరిదీ ? ఎవరు వీరు ?

ప్రైవేట్ వారు పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది ? కాంట్రాక్టర్లు ఎందుకు ? టెండర్లు ఎవరికీ ఇస్తుంది ? ప్రభుత్వ నిధులు మంజూరు అవుతున్నాయా ? లేదా ? సొసైటీ వారు ప్రజల దగ్గరనునుండి డబ్బులు ఎందుకు వసూల్ చేస్తున్నారు ? పారిశుధ్య కార్మికులకు జీతాలు ఎక్కడనుండి వస్తున్నాయి ? GHMC వాహనాలు మధురానగర్ లో ఎందుకు లేవు ? ప్రభుత్వ అధికారులు ఏమి చేస్తున్నారు ?

మధురానగర్ లో కొన్ని వేల మంది ప్రజలు నివాసముంటున్నారు. వీరందరి దగ్గర మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ GHMC వారి పేరు చెప్పి ఇంటింటికి తిరిగి డబ్బులు వసూల్ చేస్తుంది. ఈ డబ్బంతా ఎవరికీ ఇస్తుంది ? అధికారుల జేబులు నింపుతుందా ? అసలు ప్రజల పై వీరి పెత్తనం ఏందీ ? ఈ ప్రాంతంలో నివాసముంటున్నవారు ప్రభుత్వానికి వేల ట్యాక్సులు కట్టేవారే . ప్రభుత్వం వారికి సదుపాయాలు ఏర్పాటు చేయాలి.

మున్సిపల్‌ శాఖ నిబంధనల ప్రకారం కార్మికులకు కాంట్రాక్టర్లే వేతనాలు చెల్లించాలి. మరి కాంట్రాక్టర్లకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది ? ప్రభుత్వం ఇస్తుందా? లేక ప్రజలే పారిశుధ్య కార్మికుల జీతాలు ఇవ్వాలా? ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదా ? పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాలని .. మధురానగర్ వెల్ఫేర్ సొసైటీ లో నివాసముంటున్న వారి దగ్గర డబ్బులు ఎందుకు వసూల్ చేస్తుంది వసూల్ చేసిన డబ్బులో ఎవరి వాటాలు ఎంత ? నిగ్గుతేల్చాల్సిన అవసరముంది.

GHMCకి సంబంధం లేకుండా మధురానగర్ వెల్ఫేర్ సొసైటీ వారు పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చుకుంటే మరి GHMC ఏమి చేస్తోంది ? చెత్త డంపింగ్ వాహనాలు GHMC వారివి ఎందుకు తిరుగుతున్నాయి ? మధురానగర్ వెల్ఫేర్ సొసైటీ వాహనాలు కదా తిరగాల్సింది ? ఎందుకని GHMC వాహనాలు, GHMC కార్మికులు పని చేస్తున్నారు ? ఇకనైనా GHMC ఉన్నతాధికారులు ఇటువంటి దందాలపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :