- మార్గదర్శనం చేసిన వక్తల ప్రసంగాలు
- విజేతలకు బహునుతుల ప్రదానం
హైదరాబాద్: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ బుధవారం ‘ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం- 2024 – ఘనంగా నిర్వహించారు. ‘ప్రపంచ అవసరాలను తీరుస్తున్న ఫార్మసిస్టులు’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నిపుణులు పాల్గొని ఫార్మా రంగ అభివృద్ధి. విస్తరణ, ఉపాధి అవకాశాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతలను ప్రదానం చేశారు.
ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ లోని ఔషధ నియంత్ర మండలి (ఇండియా) డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ ఎం.రాంకిషన్ మాట్లాడుతూ, ఔషధ నియంత్రణ మండలి విధులు, పాత్ర, ఔత్సాహిక ఫార్మసిస్టులకు ప్రభుత్వ శాఖలలో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను వివరించారు. ఔషధ భద్రత, నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చేయడంలో ఫార్మసిస్టుల కీలక పాత్రను నొక్కి చెప్పారు.
ఆత్మీయ అతిథిగా పాల్గొన్న బొటానిక్ హెల్త్ కేర్ డైరెక్టర్, పరిశోధనా విభాగాధిపతి డాక్టర్ హెచ్.ఎన్. శివప్రసాద్, నివారణ ఆరోగ్య సంరక్షణకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని వివరించారు, మనదేశంలో న్యూట్రాస్యూటికల్స్ పెరుగుదల, ఆ రంగ అభివృద్ధి, వినూత్న పరిష్కారాలు, ముఖ్యంగా అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలలో మన సహజ సిద్ధ ఔషధాలకు పెరుగుతున్న మార్కెట్ ను వివరించారు. ఔత్సాహికులు క్లినికల్ పరిశోధన లేదా న్యూట్రాస్యూటికల్స్ వంటి రంగాలలో సొంత కంపెనీలను స్థాపించవచ్చంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు.
మరో ఆత్మీయ అతిథి, కేర్ టీఆర్యూ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డాక్టర్ ప్రియాంక దాస్, రోగి భద్రత, రక్షణ ప్రాధాన్యాన్ని వివరించారు. ముఖ్యంగా ఫార్మకోనిజిలెన్స్, ఫార్మా పరిశ్రమలో కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్. వినియోగంతో పాటు ఆ రంగంలోని డ్రగ్ సిఫ్టీ అసోసియేట్, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్, పీవి కంప్లియన్స్ మేనేజర్, అగ్రిగేట్ రిపోర్ట్ రెట్టర్ వంటి పలు కెరీర్ అవకాశాలను ఆమె ఉటంకించారు.
తొలుత, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ అతిథులను స్వాగతించి, సత్కరించారు, ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్టుల క్రియాశీల పాత్రను వివరించారు. ఈ సందర్భంగా ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బప్పాదిత్య ఛటర్జీ ‘జీ- ఫార్మ నెక్సస్’ పేరుతో రూపొందించిన తొలి పత్రికను ఆవిష్కరించారు. ఇది ఫార్మసీ స్కూల్ ఎదుగుదలకు తోడ్పడమే గాక, విస్తరణ ప్రయత్నాలకు ఉపకరిస్తుందన్నారు.
ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, గోడ పత్రికల రూపకల్పన, క్విజ్, మౌఖిక ప్రదర్శన వనంటి పలు పోటీల విజేతలకు బహమతుల పంపిణీతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.