పాఠశాలలు, కళాశాలల్లో అమ్మాయిల మీద అఘాయిత్యాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువస్తోంది. ఇటీవల హైదరాబాదులోని డీఏవీ స్కూలులో చిన్నారిపై అత్యాచారం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రత్యేక చట్టంపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ దీనిపై మాట్లాడారు.
అమ్మాయిలపై ఏదైనా ఘటన జరిగితే సదరు స్కూలు, కాలేజీ యాజమాన్యాలను బాధ్యులను చేయడం ఈ చట్టంతో సాధ్యమవుతుందని వివరించారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీల్లో చిన్నారులపై, యువతులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చట్టంతో మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నామని సీపీ పేర్కొన్నారు.
ఇక డ్రగ్స్ అంశంపైనా ఆయన స్పందించారు. గోవా డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిందని, గోవాలో ఉండి హైదరాబాదులో డ్రగ్స్ అమ్ముతున్నవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.