హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వీడడంలేదు. ఈ సాయంత్రం కూడా భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, షేక్ పేట, నాంపల్లి, గోల్కొండ, ఎస్సార్ నగర్, హైటెక్ సిటీ, మూసాపేట, మాదాపూర్, యూసుఫ్ గూడ, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రోడ్లపై నీరు ప్రవహించింది. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద భారీగా వర్షపు నీరు నిలిచింది.