- ఇది సి.యం.జగన్ మోహన్ రెడ్డికి చెంపపెట్టులాంటిది
- ఆర్-5 జోన్ ఏర్పాటు చట్టవిరుద్దం.ఈ విషయం వైసీపీ పాలకులకు తెలియదా..?
- న్యాయ స్థానాల తీర్పును బేకాతరు ..చేయడమంటే.., రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి నట్లే..!!
- మొండిగా వ్యవహరిస్తే ప్రజలు గుణపాఠం చెబుతారు.
- తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహా యాదవ్.
తిరుపతి : అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం బేఖాతరు చేయడం వల్లే జగన్ సర్కార్కు హైకోర్టు షాకిచ్చిందనీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహా యాదవ్ వ్యాఖ్యానించారు.-ఇది సి.యం.జగన్ మోహన్ రెడ్డికి చెంపపెట్టులాంటిదన్నారు.న్యాయ స్థానాల తీర్పును బేకాతరు .. చేయడమంటే.., రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి నట్లేనన్నారు. ఆర్-5జోన్ను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానాన్ని బుధవారం నరసింహా యాదవ్ తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తప్పుబట్టారు.- ఆర్-5 జోన్ ఏర్పాటు చట్టవిరుద్దమని వైసీపీ పాలకులకు తెలియదా..? అని నిలదీశారు. జగన్ సర్కార్ అనుసరిస్తున్న చట్టవ్యతిరేక విధానాలను న్యాయస్థానాలు సైతం తప్పుబడుతున్నాయని ఎద్దేవాచేశారు. అందుకే ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చిందని తెలిపారు. సుప్రీం కోర్టు వరకు వెళ్లి గెలిచి మరీ అమరావతి ఆర్ 5 జోన్ లో పేదవారికి ఇళ్లు కట్టిస్తున్నామని గొప్పగా చెప్పుకున్న జగన్ ప్రభుత్వానికి హైకోర్టు బుద్ది చెప్పడంతో పాటు, ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం పై స్టే ఆర్డర్ ఇచ్చిందన్నారు. కడుతున్న ఇళ్లను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. ఆర్ 5 జోన్ ఏర్పాటు అనేది చట్ట విరుద్దమనే అంశం పై ఇటు హైకోర్టులోనూ, అటు సుప్రీం కోర్టులోనూ కొన్ని కేసులు నడుస్తున్నాయనీ..,
ఇప్పటి వరకు రాజధాని అంశం గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీం కోర్టు ఇంకా స్టే ఇవ్వలేదని చెప్పారు. కానీ దాని ప్రకారం మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు చేయకూడదనీ.., కానీ మాస్టర్ ప్లాన్ మార్పులు చేసేసి ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి..పేదల పేరుతో ఎక్కడెక్కడో ఉన్న ఓటు బ్యాంక్‌లకు సెంటు భూములు పంపిణీ చేయడంతో పాటు శంకుస్థాపన కూడా చేయడం సి.యం జగన్మోహన్ రెడ్డి నైజాన్ని బయట పెట్టిందన్నారు. సుప్రీం కోర్టు కూడా ఇంటి స్థలాలు పంపిణీ చేయవచ్చు కానీ..అది సాధ్యం పడదు కాబట్టి చివరి తీర్పు తరువాతనే అలాంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని చెల్చి చెప్పిందని వివరించారు . ఆ మేరకే ఇళ్ల పట్టాలపై ప్రింట్ చేయాలని సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తీర్పును సైతం పక్కన పెట్టిందనీ.,. ఆర్ 5 జోన్‌లో ఉన్న భూమిపై ధర్డ్ పార్టీకి భూమిహక్కులు బదలాయింపు కావన్న విషయం తెలిసి కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా వైసీపీ గవర్నమెంట్ సొంతంగా ఇళ్లు కట్టించలేదు కానీ..కేవలం అమరావతిలోనే కేంద్రం నుంచి నిధులు రాకపోయినప్పటికీ..ఇళ్లు కట్టిస్తానని ఎందుకు హడావిడి చేస్తుందని నరసింహా యాదవ్ ప్రశ్నించారు. దీనిని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు