contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

హైదరాబాద్‌లో కుమ్మేసిన వర్షం … లోతట్టు ప్రాంతాలు జలమయం

ఈ తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఫలితంగా నగరం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న నగర వాసులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అల్వాల్, సైదాపేట, చంపాపేట, సరూర్‌నగర్, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం సహా దాదాపు నగరమంతా భారీ వర్షం కురిసింది.

భారీ వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరుకుంది. పంజాగుట్ట సర్కిల్ వద్ద భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భారీగా వర్షం కురుస్తోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతోనే వర్షాలు పడుతున్నాయని, నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావావరణ శాఖ తెలిపింది.

నగరంలో పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు

సీతాఫల్ మండి – 7.2 సెంటీమీటర్లు
బన్సిలాల్ పేట్ – 6.7 సెంటీమీటర్లు
వెస్ట్ మారేడ్పల్లి – 6.1 సెంటీమీటర్లు
అల్వాల్ – 5.9 సెంటీమీటర్లు
ఎల్బీ నగర్ – 5.8 సెంటీమీటర్లు
గోషామహల్ – 5.4 సెంటీమీటర్లు
బాలానగర్ – 5.4 సెంటీమీటర్లు
ఏఎస్ రావు నగర్ – 5.1 సెంటీమీటర్లు
పాటిగడ్డ – 4.9 సెంటీ మీటర్లు
మల్కాజ్గిరి – 4.7 సెంటీమీటర్లు
సరూర్ నగర్ – 4.6 సెంటీమీటర్లు
ఫలక్నుమా – 4.6 సెంటీమీటర్లు
గన్ ఫౌండ్రీ – 4.4 సెంటీమీటర్లు
కాచిగూడ – 4.3 సెంటీమీటర్లు
చార్మినార్ – 4.2 సెంటీమీటర్లు
గుడిమల్కాపూర్ – 4.1సెంటీమీటర్లు
నాచారం – 4.1 సెంటీమీటర్లు
అంబర్పేట్ – 4 సెంటీమీటర్లు
అమీర్పేట్ – 3.7 సెంటీమీటర్లు
సంతోష్ నగర్ – 3.7 సెంటీమీటర్లు
ఖైరతాబాద్ – 3.6 సెంటీమీటర్లు
బేగంబజార్ – 3.5 సెంటీమీటర్లు
హయత్ నగర్ – 3.5 సెంటీమీటర్లు
చిలకానగర్ – 3.5 సెంటీమీటర్లు

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :